Namaste,My name is Dr.V.Kutumba Rao,lecturer in a private junior college in Hyderabad,Andhra Pradesh.

ఒక్కసారి ఆలోచిద్దాము

మనదేశము సంస్క్రుతి,సాంప్రదాయం,వేద విజ్ఞానము,ఇలాంటి ఎన్నో గొప్పవిషయాలకు పుట్టినిల్లు. కానీ నేడు వాటి తీరుతెన్నులు మారుతున్నాయి.పరోపకారంలో మనవాళ్ళు ముందుంటే,ఇప్పుడేమో స్వార్ధంలో ముందున్నారు.ఎక్కడ చూసినా లంచగొండితనం,మానభంగాలు,కిడ్నాపులు,ఇతరుల్ని ఎలాముంచాలి అనే ఆలోచన,పక్కవాడిని ఎట్లాముంచాలి అనే దురాలోచనే ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఈమధ్య ఏన్యూస్ పేపర్ చూసిన కులాల కుమ్ములాటలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.ఎలక్ట్రానిక్ మీడియాతో సమాజానికి మంచికంటే చెడే ఎక్కువ జరుగుతున్నది.చెడుపైన ఎక్కువగా డీటైల్డ్ రిపోర్ట్ ఇవ్వడం వల్లన వాటిని చూసి కొంతమంది చెడ్డపనులు చేస్తున్నారు.పత్రికలు సమజ శ్రేయస్సు కంటే ఆర్ధిక పరమైన లావాదేవీలకే  ప్రధాన్యమిస్తున్నాయి. ఇలా మీడియా అంతా చెడునే ఫొకస్ చేస్తే,పెద్దలైతే పెద్దగా పట్టించుకోరు.కానీ భావిభారత పౌరులైన స్కూలు,కళాశాల విధ్యార్ధులు సమజమంటే ఇంత చెడ్దగా ఉన్నదా?ఇంత భయంకర మైనదా  అని అపోహపడి పాలవంటి స్వచ్హమైన మనసున్న పిల్లలందరూ సభ్యత,సంస్కారం,క్రమశిక్షణ ఇవేమీ నేర్చుకోకుండా జులాయిలు,పోకిరీలు,వెధవాయిలుగా మారతారు.అప్పుడు రాబోయే తరం బాగా లేక పోవడంవల్ల మన సమాజం  పూర్తిగా చెడి పతుంది. కేవలం ఉపాధ్యాయుల సమిష్టి క్రుషితోనే సమాజం బాగుపడుతుంది.అందువల్ల ఉపాధ్యాయులందరూ ప్రతిరోజూ ఒక్క అరగంట అయినా తరగతి గదుల్లో మంచిసమాజము ఎలాఉండాలి. దానికి మన వంతు క్రుషి ఏమి చేయాలి .సమాజం బాగుంటేనే మనం  బాగుంటామనే ఇలాంటి విషయాలను అందంగా,మోడ్రన్ మెథడ్లో చెప్పాలి.తల్లిదండ్రులుకూడా ఎంత బిజీగా ఉన్నాకూడా రోజూ పిల్లలకు కనీసం ఫోను ద్వారా అయినా మంచి చెప్పాలి.వాళ్ళను మంచివాళ్ళనుగా చేయాల్సిన భాధ్యత కూడా ఉంది.కేవలం ఫీజు కట్టాం,అంతా వాళ్ళే చూసు కుంటారని అనుకోవద్దు.మీ పర్య వేక్షణ అవసరం.విధ్యార్దులు కూడా తమ స్నేహితులు ఎవరైనా తప్పు చేస్తూ ఉంటే వాళ్ళకి ఆ తప్పును చేయవద్దని మీ తెలివి శక్తి సామర్ధ్యాలను ఉపయోగించి వారిని చెడునుంచి తప్పించండి.దానివల్ల వాడు బాగుపడతాడు.అలా అందరూ ఎల్లప్పుడూ తమ తమ పరిధులకు లోబడి మన తోటివారిని మనము మంచి వైపు నడిపిస్తే వారితోపాటు మనముకూడా  మంచిపౌరులుగా మారి సమాజంలో సుఖ శాంతులతో జీవించగలము.లేకపోతే మాత్రం మనకు ఎంత డబ్బు ఉన్నా కూడా మన చుట్టూ ఉన్న వాళ్ళు అందరూ చెడ్దవారిగా మారితే అటువంటి లోకంలో మన జీవితము దుర్భరంగా ఉంటుంది. దయచేసి ఈ విషయాన్ని అందరూ గుర్తుంచుకొని మంచి సభ్య సమాజ అభివ్రుద్దికి మన వంతు క్రుషి మనకు చేతనైనంతలో చేద్దాం రండి.

I placed 3 (MP3) files on
1) Contractions
2) 6 important sentences
3) Active voice & passive voice sentences
Please download and listen to them regularly for one week days.
The files are available here at attachments section . https://sites.google.com/site/upakarinews/

‘బాల’భారతం రియాలిటీ షో..!

రాజకీయాలలో ఎప్పుడు ఎవరు రాణిస్తారో ఎవరూ చెప్పలేని పరిస్థితి దాపురించింది. ఒకప్పుడు నీతిమంతుడు, సమాజ సేవకుడు, ప్రజాబంధువులాంటి సాధు పురుషులను, సత్సీలురను ప్రజలు ఆదరించడం రివాజు. స్వాతం త్య్రానంతరం కులరాజకీయాలు కీలకపాత్ర పోషించాయి. దాంతో వ్యక్తిగతాన్ని సైతం పక్కకుపెట్టేసి కులాధినేతలకే ఓట్లువేయడం ఆరంభమయింది. తర్వాత సినిమా గ్లామర్‌ కూడా ముఖ్యపాత్ర పోషించడంతో సినీనటులు కూడా ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు కాగలిగారు. అయితే నేటి ట్రెండ్‌ పూర్తిగా మారిపోయింది. కులం, డబ్బు, మీడియా, మందిజనం వీటన్నిం టినీ సమయానుకూలంగా వాడుకుంటూ బతికిబట్టకట్టేవాడే రాజకీయనాయకుడు.

ఎప్పుడూ పబ్లిసిటీకి దగ్గరలో ఉండాలి. అవసరం ఉన్నా లేకున్నా తరచుగా టీవీ చర్చల్లో, వార్తాపత్రికలలో కనిపిస్తూ ఉండాలి. పాపం ఈ సంగతి తెలియకుండా కొందరు సినిమా హీరోలు సొం తంగా పార్టీలు పెట్టి మూణ్ణాళ్ల ముచ్చటగా మూ సేస్తున్నారు. ఈ మధ్య కాంగ్రెస్‌లో ఉన్న చిరంజీవికి థీటుగా తెలుగుదేశం కూడా తమ అస్త్రాల అమ్ములపొదినుండి బాలయ్య అస్త్రాన్ని రాజకీయాలలోకి ప్రయోగించింది. బాలయ్య వస్తూనే తన టార్గెట్‌ ఏమిటో తెలియకనే చెప్పేశాడు. అర్జునుడు చెట్టుమీద ఎన్ని పక్షులున్నా తన లక్ష్యం పక్షి కనుగుడ్డుమీదే అన్నట్లుగా బాలయ్య కు కాంగ్రెస్‌లో ఇంతమంది రాజకీయ కోవిదు లు ఉండగా చిరంజీవినే లక్ష్యంగా పెట్టుకున్నట్లు గా కనిపిస్తోంది. అందుకే చిరంజీవి మీద తన ప్రతాపం చూపించసాగాడు. పైగా తనకు సినిమాలలో కూడా సరైన ప్రత్యర్థి చిరంజీవే.

గతంలో దసరా, సంక్రాంతిలకు విడుదలయ్యే తన సినిమాలకు చిరంజీవి తన సినిమాలను అడ్డుగోడగా విడుదలచేసేవాడు. ఇప్పుడు బాలయ్యకు సరైన సందర్భం వచ్చింది. అందుకే వస్తూనే చిరంజీవి పార్టీని తాకట్టుపెట్టేసి కాంగ్రెస్‌లో కలిపేశాడని అవకాశం వచ్చినప్పుడల్లా తొడగొట్టేయడం, మీసాలు తిప్పేయడం, అవసరమనుకుంటే తన సింహాలోని డైలాగులను ప్రజలకు వినిపించడం వంటి టక్కుటమార గోకర్ణగజకర్ణ విద్యలన్నీ ప్రదర్శించేస్తున్నాడు. దాంతో ఒళ్లు మండిన చిరంజీవి తానేం తక్కువ తినలేదన్నట్లు గా బాలయ్య రాజకీయాలకు బాలుడని…అప్పటికి తానేదే సీనియర్‌ అని అర్థమొచ్చేలా మాట్లాడాడు.

జనాలకు ఇవన్నీ చూస్తుంటే ఇద్దరికిద్ద రూ రాజకీయాలలో బాలుళ్లే అని అర్థం చేసుకుంటున్నారు. ఎన్టీఆర్‌ చనిపోయిన ఇన్నాళ్లకు రాజకీయాలలోకి ఫుల్‌టైమ్‌గా రావాలనుకోవ డం… వచ్చీరాగానే ప్రజాసమస్యలను పక్కకుపెట్టేసి ప్రత్యర్థి చిరంజీవిపై వ్యాఖ్యలు చేయడం ఇవన్నీ బాల చేష్టలే అయితే… చిరంజీవి కూడా మూణ్ణాళ్ల ముచ్చటగా పార్టీని నట్టేటముంచేసి కాంగ్రెస్‌లో చేరిపోవడం పైగా అధికార ప్రభుత్వాన్ని అవిశ్వాస గండం నుంచి కాపాడేసి కేవ లం రెండు ప్రాధాన్యత లేని పదవులతో సంతృప్తి చెందడం కూడా బాలచేష్టలే అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. మరి రాజకీయాలకు కొత్తగా వచ్చిన ఈ బాల నటరాజకీయ నేతలను ప్రజలు ఎంతగా ఆదరించి ఓట్లేస్తారో కాలమే నిర్ణయిస్తుంది.

అయితే మరికొందరు రాజకీయ బాలురను పరిశీలిస్తే ముఖ్యమంత్రి సీఎం కిరణ్‌కుమార్‌ కూడా గతంలో పదవులేమీ పొందకుం డానే సీఎం సీటును సంపాదించుకుని ఇంకా బాల్య దశలోనే ఉన్నారు. అలాగే కొత్తగా పీసీసీ పీఠం పొందిన బొత్సా సత్యన్నారాయణ కూడా ఇంకా పరిణితి చెందని బాలుడిలా పార్టీ అంతర్గ త కుమ్ములాటలను నియంత్రించలేకపోతున్నా రు. సో… ఇంతమంది బాలలతో మన రాష్ట్ర రాజకీయాలు ఎలా మలుపు తిరుగుతాయో… వీళ్లలో ఎవరు సాహసబాలలుగా ప్రమోట్‌ అవుతారో చూడాలి. అప్పటిదాకా మనం రాష్ట్రంలో ‘బాల’భారతం ధారావాహిక రియాలిటీ షోను నిరవధికంగా, క్రమం తప్ప కుండా చూస్తునే ఉండాలి.

  • -ఎం.ఎస్.శ్యామలా శర్మ
  • 28/01/2012
TAGS:

 హే రామ్!

  • – సేకర్త: జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ
  • 30/01/2012

 ‘‘అనాయాసేన మరణం, వినాదైనే్యన జీవనమ్’’

1948 సం. జనవరి 28వ తేదీ
రాజకుమారి అమృతకౌర్:- ఈనాటి ప్రార్థనా సమావేశంలో అల్లరి జరుగలేదు.
గాంధీ:- నీ అభిప్రాయమేంటి? నన్ను గురించి నీవు బాధపడుతున్నావా? పిచ్చివాడెవడైనా నన్ను తుపాకితో కాల్చి చంపితే అప్పుడు కూడా నా హృదయంలో పరమేశ్వరుని నామస్మరణ, ముఖంలో చిరునవ్వు ఉండాలి. ఒకవేళ ఆ విధంగా జరిగితే నీ కంట ఒక్క నీటి చుక్కైనా కారదని నీవు నాకు మాట ఇవ్వాలి.
1948 సం. జనవరి 29వ తేదీ
దినమంతా పనిచేయడంవల్ల సాయంత్రం ఆయన అలసిపోయారు. తల తిరుగుతున్నది. అయినా లోక సేవ సంఘ రూపంతో కాంగ్రెసుకిచ్చిన కొత్త విధానం (వీలునామా) వైపు చూపిస్తూ, ‘‘దీనిని ఈరోజే నేను పూర్తిచేయాలి’’ అన్నారు. ఆయన ఆరోజు రాత్రి గం.9-25 ని.లకు పడుకోవడానికి లేచారు. ‘మనూ’తో.‘‘జీవితమనే పూల తోటకు వచ్చే శోభ బహుకొద్ది దినాలే కనుక ఆ కొద్ది రోజులే దాన్ని అనుభవించి సంతోషపడడం!’’ అంటూ పక్కపై పరున్నాడు.
1948 జనవరి 30వ తేదీ శుక్రవారం
బాపూ తన నియమానుసారం నిత్య ప్రార్థనకు ఉదయం గం.3-30 ని.లకు లేచారు. ప్రార్థన అయ్యాక మరికొంతసేపు పడుకున్నారు. ఉదయం 8 గం.లకు ప్రతి దినము చేయించుకునే మాలీస్‌కు కోసం ఆయన ప్యాలేలాల్ ఉండే గదిమీదుగా పోతూ, కాంగ్రెసుకు గాను వ్రాసిన కొత్త విధానాన్ని ఆయనకిచ్చి ‘‘దీనిని చూడండి’’అన్నారు. మాలీసు పూర్తిచేసుకొని తిరిగి వస్తూ ‘‘అది చూడటం పూర్తి అయిందా!’’ అని ప్యారేలాల్‌ను అడిగాడు. మద్రాసు అన్నపు కరువు విషయమై ఒక ప్రకటనను కూడ తయారుచేయండని ఆయనతో చెప్పారు. తరువాత గాంధీ స్నానం చేసి సుఖంగా వచ్చి భోజనం చేశారు. బెంగాలీ భాషా పాఠం జ్ఞాపకం చేసుకున్నాడు. అప్పటికి ప్యారేలాల్ లోక సేవక సంఘ విధానాన్ని సరిచూచి తిరిగి తెచ్చాడు. దానిని గాంధీ మరల శ్రద్ధతో చూచాడు. తరువాత నిత్య కార్యాలను యధాపూర్వకంగా చేసుకున్నాడు.
మధ్యాహ్నం రెండు జాముల వరకు ఆయన నిద్రించాడు. తరువాత, ఆయనను చూడటానికి కొందరు వచ్చారు. వచ్చిన వారిలో ఢిల్లీ వౌల్వీలు కొందరున్నారు. వారు బాపూతో, ‘‘మీరు వార్థాకు వెళ్లనున్నారా?’’ అన్నారు. బాపూ వారితో అన్నాడు ‘‘నేను వెళ్ళి కొన్ని రోజులే వుంటాను. ఈశ్వరేచ్చ వేరై, ఏదైనా అనూహ్య సంఘటన జరిగితే చెప్పలేను.’’ తరువాత ‘బిషన్’తో బాపూ ఇట్లన్నారు; ‘‘బిషన్! నాకు వచ్చిన ముఖ్యమైన ఉత్తరాలన్నీ తీసుకొనిరా. ఈనాడే వాటికి నేను జవాబులియ్యాలి. బహుశా రేపు నేను ఉండనేమో!’’
అప్పుడు కొందరు సింధీ శరణార్థులు వచ్చారు. వారి గాధలు విని గాంధి దుఃఖపడ్డాడు. సాయంకాలం 4 గంటలకు సర్దార్‌పటేలు వచ్చాడు. ఆయనతో ఒక గంట సంభాషణ జరిగింది. సర్దారుతో మాట్లాడటం కొంత ఆలస్యమయింది. బాపూ వెంటనే లేచి ప్రార్థనా స్థలానికి సాగిపోయారు. ప్రార్థనా వేదిక మీదికి ఆయన చేరే లోగానే, ప్రార్థనకు వచ్చిన జన సమూహంలోనుండి యువకుడొకడు మోచేతులతో మనుష్యులనటూ యిటూ నెట్టుకుంటూ గాంధీ ముందుకు వచ్చి, ప్రణామం కోసమన్నట్లు క్రిందకు వంగి, మరల లేచి, తన రెండుచేతుల మధ్యనుండిన పిస్తోలుతో,‘‘్ఢం, ఢాం, ఢాం’’ అని గాంధీ గుండెపై మూడు గుండ్లు పేల్చాడు. బాపూ ‘హే రామ్!’ అంటూ ఒరిగిపోయారు.
– సేకర్త: జానమద్ది హనుమచ్ఛాస్ర్తీ.

– నండూరి రవిశంకర్‌

1 Comment
  • Gandhi is a greatest misuse useless political leader of india. he is not father of nation ,he is great distraer of nation.Really Lokamanya BALA GANGADHAR TILAK IS OUR GREAT FATHER OF THA NATION.iT IS TROUTH.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Home
Join Class (WhatsApp)
YT